పిల్లల ఎదుగుదలకు పల్లీలు


రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరో గ్యంగా ఉండండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశెనగపప్పు ఆరోగ్వానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని మోనో శాచ్యురేటెడ్ కొవ్వు గుండెకు మంచిది. శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీన్లు కణాలు, కణజాల మరమ్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. డిప్రెషన్ ను తగ్గిస్తాయి. వేరుశెనగపప్పులోని అమినో యాసిడ్స్ మెదడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తు అది మన మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. వేరుశెనగలోని విటమిన్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని కాల్షియమ్, విటమిన్ 'డి' లు ఎముక పుష్టికి దోహదపడతాయి. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్ 'ఇ' ఉంటుంది. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోష కాలుగా అందించవచ్చు. వలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆ ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్ కారకాలు పేరుకోకుండా వాటిని అదుపులో ఉంచుతాయి. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసినను పల్లీలే అంది స్తాయి. కాబట్టి రోజుకో గుప్పెడు పల్లీలను - తినడం అలవాటు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.